చైతూ బాలీవుడ్ సినిమా.. గీత వాళ్ల చేతిలో!


బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా 2018 లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ ఎట్టకేలకు హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా లాల్ సింగ్ చద్దా సినిమాను చేసిన విషయం తెల్సిందే. అద్వైంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించాడు.

గత కొన్ని నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈమద్య కాలంలో హిందీ సినిమా లు సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవ్వడం కామన్ విషయం గా మనం చూస్తున్నాం.

లాల్ సింగ్ చద్దా సినిమా లో నాగ చైతన్య ఉండటంతో పాటు అమీర్ ఖాన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఉంది. కనుక లాల్ సింగ్ చద్దా ను తెలుగు లో భారీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు. తాజాగా ఈ సినిమా ను భారీ మొత్తానికి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది.

చాలా అరుదుగా మాత్రమే గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు. సినిమాపై చాలా నమ్మకంతో ఈ సినిమాను వారు డబ్బింగ్ చేసి డస్ట్రిబ్యూట్ కు సిద్దం అయ్యారని తెలుస్తోంది. నాగ చైతన్య ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అమీర్ ఖాన్ సినిమా లో మన నాగ చైతన్య అంటూ చాలా మంది ఆసక్తిగా లాల్ సింగ్ చద్దా కోసం వెయిట్ చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వారం పది రోజుల్లోనే లాల్ సింగ్ చద్దా తెలుగు వర్షన్ కు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ను మరియు ఇతర ఆసక్తికర విషయాలను గీతా ఆర్ట్స్ వారు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటూ మీడియా వర్గాల్లో టాక్ నడుస్తుంది.

సినిమా ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి లాల్ సింగ్ చద్దాను తెలుగు వారు ఏ మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి.