ఆచార్య మాదిరిగానే ‘అఖండ’

పరిస్థితులు చక్కగా ఉంటే ఈ నెలలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. చిరంజీవి ఆచార్య మరియు బాలకృష్ణ అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవి. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ సినిమాలు ఎప్పటికి వచ్చేనో కూడా తెలియడం లేదు. కాని విడుదల తేదీతో సంబంధం లేకుండా సినిమాలను ముగించి పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. చాలా సినిమాలు షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ నుండి మొదలుకుని అఖండ.. ఆచార్య సినిమాల వరకు షూటింగ్ క్లైమాక్స్ లో ఉన్నాయి.

ఇటీవలే ఆచార్య షూటింగ్ రెండు వారాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ నాలుగు నుండి అయిదు వారాలు బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా కూడా షూటింగ్ ముగింపు దశకు చేరినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే షూటింగ్ మెజార్టీ పార్ట్ పూర్తి చేసిన బోయపాటి పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత రెండు నుండి మూడు వారాల షెడ్యూల్ తో సినిమా ను పూర్తి చేయబోతున్నాడట.

బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలతో కనిపించబోతున్న అఖండ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు రానంత బజ్ ఈ సినిమా కు క్రియేట్ అయ్యింది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను అఖండ దక్కించుకుంటాడనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కు భారీ వ్యూస్ దక్కాయి. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ లు క్రాస్ చేసిన టీజర్ గా అఖండ నిలిచింది. ఆచార్య మరియు అఖండ రెండు కూడా దాదాపుగా ఒకే సమయంలో షూటింగ్ ను పూర్తి చేసుకుని మూడు నాలుగు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.