షూటింగ్ లో పెట్టే భోజనం కోసం వెళ్లేదట

బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్ వారసురాలిగా హీరోయిన్ గా ఎంపిక అయిన ఆలియా భట్‌ ప్రస్తుతం నెం.1 హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పారితోషికంగా బాలీవుడ్ లోనే టాప్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కోట్ల పారితోషికం కోసం షూటింగ్‌ కు హాజరు అవుతున్న ఆలియా భట్‌ చిన్నతనంలో షూటింగ్‌ లకు కేవలం భోజనం కోసం వెళ్లేదట. షూటింగ్‌ లో పెట్టే రకరకాల భోజనం అంటే ఆలియాకు చిన్నతనంలో చాలా ఇష్టమట. అందుకే ఆమె తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.

ఆలియా ఈ విషయాన్ని స్వయంగా ఒక టాక్ షో లో చెప్పుకొచ్చింది. షూటింగ్‌ లో అప్పట్లో ఇచ్చే వేరు శనగలు, గ్రీన్ టీ మరియు ఇతర ఫుడ్ అంటే బాగా ఇష్టపడేదట. దాంతో షూటింగ్‌ కు హాజరు అయిన ప్రతిసారి తప్పకుండా యూనిట్‌ సభ్యులు ఏం తింటే అదే ఆమె తినేదట. షూటింగ్‌ లో పెట్టే ఫుడ్‌ కోసమే తాను చిన్నప్పుడు షూటింగ్‌ కు వెళ్లేదాన్ని అంటూ ఆలియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది.