వైరస్ కంటే ముందే మన భయం చంపేస్తోంది – చిరంజీవి

కరోనా సెకండ్ వేవ్ ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో మనందరం చూస్తూనే ఉన్నాం. గతేడాది కంటే భయంకరంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మనం ఎంతో మంది ఆత్మీయులను కోల్పోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఈ నేపథ్యంలో మనందరినీ సోషల్ మీడియా ద్వారా జాగ్రత్త పరిచారు. వీడియో మెసేజ్ ను పోస్ట్ చేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

“కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఇంట్లో నుండి బయటకు రావొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే కచ్చితంగా మాస్క్ ను ధరించండి. సోషల్ డిస్టన్సింగ్ ను పాటించండి. కరోనా లక్షణాలు ఉంటే కుటుంబ సభ్యుల నుండి ఐసొలేట్ అవ్వండి. కానీ పానిక్ అవ్వకండి. వైరస్ కంటే ముందే భయమే మనల్ని చంపేస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్ పాటించండి. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం లాంటివి ఉంటే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అవ్వండి. మనం కలిసికట్టుగా ఈ కరోనాను దూరం చేయగలం” అని చిరంజీవి పిలుపునిచ్చారు.