సమంత వెబ్‌ సిరీస్ పై లెజెండ్రీ డైరెక్టర్‌ ఆగ్రహం

ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 వెబ్‌ సిరీస్ పై మొదటి నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళ జనాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా కూడా హిందీలో ఈ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. తమిళం మరియు తెలుగు లో మాత్రం స్ట్రీమింగ్‌ వాయిదా వేశారు. తమిళ ప్రజలు కాస్త శాంతించిన తర్వాత వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే వెబ్ సిరీస్ పై తమిళులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

తాజాగా తమిళ లెజెండ్రీ డైరెక్టర్‌ భారతీరాజా మాట్లాడుతూ.. తమిళ జాతి మొత్తం ఈ వెబ్‌ సిరీస్ ను నిలిపి వేయాలని కోరుకున్నా కూడా కేంద్రం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వం తమిళుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా భారతి రాజా మాట్లాడుతూ ఈ వెబ్‌ సిరీస్ ను తమిళులకు వ్యతిరేకంగా ప్రసారం చేయడం విచారకరం అన్నాడు. తమిళుల మనోభావాలను దెబ్బ తీసిన వారిపై కేంద్రం ఇప్పటికి అయినా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు.