శ్రీకాంత్ పై సీనియర్ హీరో నరేశ్ సీరియస్..! ఏమన్నారంటే..

సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంగా సీనియర్ హీరో నరేశ్ విడుదల చేసిన వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నరేశ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నరేశ్ తీవ్రంగా స్పందించారు. ‘సాయితేజ్ విషయంలో నా వీడియో బైట్ మీడియాలో తప్పుగా ప్రసారమైంది. ఇందుకు పెద్దలు మందలించారు కూడా. కానీ.. శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదు. నా ముందే హీరోగా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నాడు’.

‘మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తూ నా ప్యానల్ ముందు ఓడిపోయావు. 50 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ ఎలాంటి వివాదాలు, విమర్శలకు తావులేకుండా ఉన్నాను. మరోసారి వీడియోలు విడుదల చేసేముందు శ్రీకాంత్ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని హితవు పలికుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. వయసులో ఉన్నవారు ద్విచక్రవాహనాలు నడపడం సహజమని, ప్రమాదాలు కూడా సహజమని నరేశ్‌ అన్నారు. సాయితేజ్ స్పీడ్‌గా వెళ్లలేదని, జారిపడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని నరేశ్ మరోమారు స్పష్టం చేశారు.