విక్రమ్ వేద రీమేక్ కోసం సన్నద్ధమవుతోన్న హ్రితిక్ రోషన్

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద హిందీలో రీమేక్ అవుతోన్న విషయం తెల్సిందే. మాధవన్, విజయ్ సేతుపతి తమిళ్ లో హీరోలుగా నటించగా, హిందీలో హృతిక్ రోషన్ వేద పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన పాత్ర కోసం సన్నద్ధమవుతున్నాడు. మే నుండి ఈ పాత్ర కోసం ఫిజికల్ గా కూడా శ్రమిస్తాడట. జూన్ నుండి విక్రమ్ వేద రీమేక్ షూటింగ్ ప్రారంభవుతుంది.

తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్-గాయత్రీ ఈ సినిమాను హిందీలో కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. మరో లీడ్ పాత్రలో విక్రమ్ గా సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్, హ్రితిక్ గ్యాంగ్స్టర్ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా కాకుండా హ్రితిక్ దీపికా పదుకోన్ తో పనిచేయబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాను కూడా చేయాల్సి ఉంది హ్రితిక్.