హైపర్ ఆది వివాదం: కరాటే కళ్యాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శాంతి స్వరూప్

శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది వేసిన ఒక స్కిట్ బాగా వివాదం అయింది. అందులో తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మను హేళన చేసారని జాగృతి సంఘం వారు ఆరోపించారు. అయితే ఆది దీనిపై వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, అయినా ఆ స్కిట్ తాను రాయలేదని అంటున్నాడు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా కరాటే కళ్యాణి, “ఆది నువ్వు హైపర్ అవ్వొచ్చు కానీ శృతి మించింది కాస్త తగ్గి క్షమాపణలు చెప్పాలని నేను కోరుతున్నా. నువ్వు ఒక సంస్కృతిని అవమానిస్తే, గుంజి” అని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ వ్యాఖ్యలపై హైపర్ ఆది టీమ్ లో తరచుగా కనిపించే శాంతి స్వరూప్ స్పందించాడు. “కరాటే కళ్యాణి గారు ఈ పోస్ట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. ముం*మోపి ఆడది ముత్తైదువుకి సలహా ఇచ్చినట్లుంది” అని శాంతి స్వరూప్ పోస్ట్ చేసాడు. అయితే కాసేపటికే దాన్ని డిలీట్ చేసేసాడు.