సీతగా మారిన వంటలక్క.. దారుణంగా ట్రోల్స్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయిన వంటలక్క అలియాస్ కార్తీక దీపం దీప అలియాస్‌ ప్రేమి విశ్వనాథ్‌ సోషల్‌ మీడియాలో కూడా రెగ్యులర్‌ గా సందడి చేస్తూ ఉంటారు. ఆమె త్వరలో రాబోతున్న ఉగాది సందర్బంగా ఒక ఈవెంట్‌ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌ లో లవకుశ సినిమా పేరడీ చేయడం జరిగింది. డాక్టర్‌ బాబు రాముడిగా, సీత పాత్రలో ప్రేమి కనిపించగా లవ కుశల పాత్రలో కార్తీక దీపం పిల్లలు ఇద్దరు కనిపించారు. ఆ స్కిట్‌ త్వరలో రాబోతుంది. అయితే అందుకు సంబంధించిన ఫొటో ను ప్రేమి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా ఉన్న నయనతార లుక్‌ తో కలిపి ప్రేమి తన ఫొటోను జోడించుకుని షేర్‌ చేసింది. నయనతారతో పోల్చుకోవడం ఆమె ఫొటో పక్కన పెట్టడం మరీ విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ట్రోల్స్ నమోదు అవుతున్నాయి. నెట్టింట వంటలక్క పై ఈ రేంజ్‌లో ట్రోల్స్‌ రావడం ఇదే ప్రథమం. మేకప్‌ ఎక్కువ అయ్యిందని కొందరు.. నీకు నయన్‌ తో పోలికనా అంటూ మరి కొందరు.. నువ్వు సీత పాత్రకు ఎలా సెట్‌ అవుతావని మరి కొందరు రకరకాలుగా ట్రోల్‌ చేస్తూ ఉన్నారు. వీటికి ప్రేమి ఎలా సమాధానం చెప్పనుందో చూడాలి.