2023లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డే ముఖ్యమంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పార్టీల్లోని అగ్ర నాయకులు అందరూ సాగర్ లో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జానారెడ్డి ఈరోజు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు జానారెడ్డే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ మాటలు చెప్తున్నానని అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కూడా సంచలనం రేపాయి.నాగార్జున సాగర్ లో తామంతా బలవంతం చేస్తేనే జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సాగర్ లో రెండోసారి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే జానారెడ్డి ఎఫెక్టేనని.. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు తథ్యం అని అన్నారు.