నితిన్ సినిమానూ పట్టేసిన కృతి శెట్టి

యంగ్ హీరో నితిన్ వరసగా రెండు ప్లాప్స్ తర్వాత మరోసారి తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. వరసగా రెండు చిత్రాలను సైన్ చేసాడు నితిన్. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ కు స్క్రిప్ట్ నచ్చడంతో స్వయంగా తనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి ఫైనల్ అయినట్లు సమాచారం. ఉప్పెన చిత్రంతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది కృతి శెట్టి. వరసగా సినిమాలు సైన్ చేస్తోంది.

నాని సినిమా శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసింది. అలాగే సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది సినిమా కూడా చేసింది. రామ్ ద్విభాషా చిత్రంతో పాటు ఇప్పుడు నితిన్ సినిమా కూడా చేస్తోంది కృతి శెట్టి.