మోసగాళ్లు ట్రైలర్: అతి పెద్ద ఐటి స్కామ్ లో మంచు విష్ణు, కాజల్

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం మోసగాళ్లు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

మోసగాళ్లు ట్రైలర్ ముందు నుండీ ప్రచారం చేసినట్లుగానే డబ్బు చుట్టూనే తిరిగింది. బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న కొంత మంది కలిసి సిస్టంకు వ్యతిరేకంగా వెళ్లి కోట్ల స్కామ్ ఎలా చేసారు, తర్వాత ఆ డబ్బును ఎలా కాపాడుకున్నారు, చివరికి ఏమైంది అన్న పాయింట్ తో మోసగాళ్లు చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది. సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది.

జెఫ్రీ జీ చిన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, కాజల్ అగర్వాల్ మంచు విష్ణుకు సిస్టర్ పాత్రలో కనిపించనుంది. నవదీప్, నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.