అన్నాడీఎంకే అధికారం పళని స్వామికే

తమిళనాట ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి గట్టి షాక్ ఇచ్చి డీఎంకే అధినేత స్టాలిన్‌ సీఎంగా ఎన్నిక అయ్యాడు. దాంతో అన్నాడీఎంకే ప్రతిపక్ష హోదాలోకి వెళ్లి పోయింది. అమ్మ చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ పన్నీర్‌ సెల్వం పళని స్వామి వర్గాలుగా విడిపోయాయి. ఈ రెండు టీమ్ లు పార్టీకి మరింతగా నష్టం చేకూర్చుతున్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది అందరిని ఆకర్షించిన విషయం.

అన్నాడీఎంకే పార్టీలో ఉన్న విభేదాల కారణంగా పన్నీర్‌ సెల్వం ఖచ్చితంగా పళనికి అవకాశం ఇవ్వక పోవచ్చు అన్నారు. కాని అనూహ్యంగా గెలిచిన దాదాపు అందరు ఎమ్మెల్యేలు కూడా అన్నాడీఎంకే పార్టీని మరియు ఎమ్మెల్యేలను నడిపించే బాధ్యతను పళనికే అప్పగించడం జరిగిందట. అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలతో పాటు ప్లోర్‌ లీడర్ గా కూడా ఆయనే వ్యవహరించే అవకాశం ఉంది. ఈ లెక్కన పన్నీర్‌ సెల్వం పనైపోయినట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.