ఏడాది తర్వాత మరోటి వదులుతున్న వకీల్‌ సాబ్‌

పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన వకీల్‌ సాబ్ విడుదలకు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ పింక్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. గత ఏడాదిలో విడుదల చేయాలనుకున్న సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. గత ఏడాదిలో మార్చి నెలలో మగువ పాటను విడుదల చేయడం జరిగింది. అప్పటి నుండి పాట సినిమా పై అంచనాలు ఆసక్తి పెంచుతూనే ఉంది. ఎట్టకేలకు సినిమా నుండి రెండవ పాట రాబోతుంది. ఏడాది తర్వాత వకీల్ సాబ్ నుండి మరో పాట వస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

వకీల్‌ సాబ్ ఆడవారి సమస్యలపై ఉండే ఒక మెసేజ్‌ ఓరియంటెడ్ చిత్రం. కనుక ఈ సినిమా లో రెండు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే మగువ విడుదల అవ్వగా రెండవ పాటను రేపు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. థమన్‌ గత కొన్ని రోజులుగా ఈ పాట విడుదల చేయాలనే ఉబలాటంతో ఉన్నాడు. మొదటి సారి పవన్‌ కళ్యాణ్‌ తో వర్క్‌ చేసిన థమన్ ది బెస్ట్‌ ఇవ్వాలని చాలా కష్టపడ్డట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా ను ఏప్రిల్‌ 9న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.