సీఎంగా జగన్ 40 ఏళ్లు ఉండాలి

ఏపీకి సీఎంగా జగన్‌ 40 ఏళ్లు ఉండాలని నేను అనుకుంటున్నట్లుగా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నాడు. ఒక వైపు జగన్ బెయిల్‌ రద్దు చేసి జైల్లో పెట్టాలని కోర్టులో పోరాటం చేస్తూ మరో వైపు ఆయన 40 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకోవడం విడ్డూరంగా ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ వ్యంగ్యంగా ఆ వ్యాఖ్యలు చేశాడు. సీఎంగా జగన్‌ ఎంపిక అవ్వడం తనకు ఇష్టం లేదని కూడా ఒక సందర్బంలో ఆయన వ్యాఖ్యలు చేశాడు.

మొత్తానికి వైకాపా నుండి ఎంపీగా గెలిచి ఆ పార్టీ అధినేతపై తిరుబాటు జెండా ఎగుర వేసి ఆయన్ను జైలుకు పంపించాలని ప్రయత్నాలు చేస్తున్న రఘురామ ఏం మాట్లాడినా కూడా విభిన్నంగా విచిత్రంగానే ఉంటుంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నించిన జగన్‌ కోర్టు ఆదేశాలతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇక దేశంలో ఏ సీఎం కూడా బ్యూరో క్రాస్ట్‌ కు కోర్టు మొట్టికాయలు వేయలేదు. కోర్టుల చేత అక్షింతలు వేయించుకోలేదు. కాని జగన్ వల్ల ఏపీ బ్యూరో క్రాస్ట్‌ కు మొట్టికాయలు పడ్డాయని రఘురామ అన్నారు.