పుష్ప 2… శ్రీవల్లి కూడా అదే మాట

అల్లు అర్జున్ పుష్పరాజ్ గా.. రష్మిక మందన్న శ్రీవల్లిగా నటించిన ‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు దక్కించుకున్న పుష్ప కు ఈ ఏడాది డిసెంబర్ లో పార్ట్ 2 రాబోతున్న విషయం తెల్సిందే. శ్రీవల్లి మెడలో పుష్పరాజ్ తాళి కట్టడంతో పుష్ప పార్ట్ 1 ముగిసింది. ఇక రెండవ పార్ట్ లో భార్య భర్తలుగా పుష్ప శ్రీవల్లి కనిపించబోతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప 2 గురించి మేకర్స్ రకరకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 మరింత హౌ ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉంటాయంటూ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దర్శకుడు మాట్లాడుతూ మరింత ఆసక్తికర ముందు ఉంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

పుష్ప పార్ట్ 2 లో కూడా బన్నీ లుక్ అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బన్నీ తన జుట్టు మరియు గడ్డంను ట్రిమ్ చేయకుండా అలాగే కొనసాగుతున్నాడు. షూటింగ్ కోసం అల్లు అర్జున్ దాన్ని అలాగే ఉంచేస్తున్నాడు. అల్లు అర్జున్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 ఖచ్చితంగా మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. అనసూయ కూడా మాట్లాడుతూ రెండవ పార్ట్ లో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా పుష్ప 2 గురించి మాట్లాడుతూ అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు.

తాజాగా హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ పుష్ప పార్ట్ 2 బిగ్గర్ అండ్ బిగ్గర్ అంటూ వ్యాఖ్యలు చేసింది. పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప పార్ట్ 2 బిగ్గర్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్ 1 లో కనిపించిన పాత్రలు పార్ట్ 2 లో కంటిన్యూ అవ్వబోతున్నాయి. అయితే పార్ట్ 1 లో రష్మిక.. ఫాహద్ ఫాజిల్.. అనసూయ ఇంకా కొందరి పాత్రలను సాదారణంగా చూపించారు. కాని పార్ట్ లో వారి పాత్రల పరిధి పెరుగుతుంది. కథ ముందుకు సాగాలంటే వారి ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉండాలి. కనుక వారి పాత్రలు మరింతగా ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పార్ట్ 2 ఒక భారీ పాన్ ఇండియా సినిమా గా మళ్లీ నిలవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ అభిప్రాయంను మరింత బలంగా మారుస్తుంది.