ఓటుకు నోటు కేసు.. ఆ వాయిస్‌ చంద్రబాబుదే

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఓటుకు నోటు కేసు వదిలేలా లేదు. రేవంత్‌ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా శిక్ష ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసు విచరణ మెల్లగా సాగుతోంది. నిన్న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలంను ఏసీబీ స్పెషల్ కోర్టు నమోదు చేసింది. అందులో ఫోన్ లో మాట్లాడిన వాయిస్‌ చంద్రబాబుదే అంటూ మరోసారి స్టీఫెన్ సన్‌ చెప్పినట్లుగా వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలో స్టీఫెన్‌ సన్ ను తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ఓటు వేయాల్సిందిగా రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. అక్కడ డబ్బులు పెట్టిన విషయం కూడా ప్రత్యక్ష సాక్షులతో నమోదు చేయడం జరిగింది. ఏసీబీ ఈ కేసులో రేవంత్‌ రెడ్డితో పాటు మరి కొందరిని కూడా చేర్చడం జరిగింది. వారందరి విషయంలో కూడా ఒకొక్కరి చొప్పున విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఓటుకు నోటు కేసు మెల్లగా నత్తనడకన సాగుతుంది. అప్పుడప్పుడు ఈ కేసు విషయమై మీడియాలో హడావుడి కనిపిస్తుంది.