ప్రతి ఒక్కరు నా బాడీపై కామెంట్స్ చేశారు

సౌత్ ఆడియన్స్‌ కు సుపరిచితురాలైన షకీలా బయోపిక్ లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న రిచా చద్దా సంచలనాత్మక హీరోయిన్‌ గా మారిపోయింది. హాట్‌ బ్యూటీగా పేరు దక్కించుకోవడంతో పాటు నటిగా తనకు తానే సాటి అన్నట్లుగా గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మరింతగా గా ఆఫర్లతో దూసుకు పోతుంది. ఈ సమయంలో ఈమె మీడియాతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వెళ్లడించింది. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఎక్కడకు ఆఫర్ల కోసం వెళ్లినా కూడా అందరు నా బాడీ షేమింగ్‌ గురించి వ్యాఖ్యలు చేసేవారు. కొందరు నా ముక్కు సరిగా లేదని వ్యాఖ్యలు చేస్తే కొందరు నా ఫేస్ సరిగా లేదని కొందరు నా వక్షోజాలు సరి చేయించుకోవాలని మరి కొందరు నా వెయిట్ తగ్గించుకోవాలని.. కొందరు వెయిట్‌ పెంచుకోవాలని చెప్పేవారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉన్న ఆ సమయంలో నాకు వారిపై కోపం వచ్చేది. ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నాకు ఆ సమయంలోనే తెలిసి వచ్చిందని రిచా చద్దా చెప్పుకొచ్చింది.