సుధీర్ క్యారెక్టర్‌ పై సాయి లేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

సుడిగాలి సుధీర్‌ అమ్మాయిలు అంటే పడి చస్తాడు, అమ్మాయిలు ఎక్కడ ఉంటే అతడు అక్కడ ఉంటాడు. అమ్మాయిల వీక్‌నెస్ అతడికి మరీ ఎక్కువ అంటూ అతడి స్కిట్లు మరియు ఈవెంట్ ల్లో అతడి మాటలు చూస్తూ ఉంటే అనిపిస్తు ఉంటుంది. తోటి కంటెస్టెంట్స్ కూడా సుధీర్‌ విషయంలో ప్రేక్షకుల్లో అదే ఫీలింగ్ కలిగేలా కామెడీ చేస్తూ ఉంటారు. అలా సుధీర్ ను ఓ రేంజ్ కాట్రాజ్ ను చేశారు. అయితే నిజానికి సుధీర్‌ అలాంటి వాడు అస్సలు కాదని, కామెడీ కోసం మాత్రమే అలాంటి పంచ్ లు భరిస్తున్నాడు అంటూ ఆయనను దగ్గర నుండి చూసిన వారు అంటున్నారు.

జబర్దస్త్‌ లో సుదీర్ఘ కాలంగా లేడీ గెటప్‌ వేస్తూ సాయి లేఖగా గుర్తింపు దక్కించుకున్న సాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుధీర్‌ గురించి బయట ఉన్న టాక్‌ కు స్కిట్ లో మేము వేసే పంచ్‌ లకు పూర్తి విరుద్దంగా ఉంటాడు. అతడో మంచి వ్యక్తి. స్కిట్‌ ల కోసం అలాంటి పనులు చేస్తాడు తప్ప బయట మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తి. చిన్న పిల్లాడి మాదిరిగా అందరితో కూడా చాలా బాగుంటాడు అంటూ సాయి చెప్పుకొచ్చాడు.