వకీల్ సాబ్: ఫ్లాష్ బ్యాక్ లో పవన్ పాత్రపై ఫుల్ క్లారిటీ

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే బోలెడన్ని మార్పులకు లోనైంది. ముఖ్యంగా లీడ్ రోల్ లో చేసిన పవన్ కళ్యాణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జత చేసారు. ఇందులో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటించింది.

ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డంతో విప్లవ నాయకుడి పాత్రను పోషించాడట. ఈ ఎపిసోడ్ కు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉండేలా డిజైన్ చేసాడట దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ కు మెయిన్ సోల్ పాయింట్ అని ముగ్గురి అమ్మాయిల కథను కూడా చాలా బాగా, హృదయానికి హత్తుకునేలా ఎగ్జిక్యూట్ చేసాడట.