అన్ లక్కీ అంటూ కామెంట్.. రేణు దేశాయ్ గట్టి కౌంటర్

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ తో విడిపోయిన తర్వాత అకిరా నందన్, ఆద్య బాధ్యతలు చూసుకుంటున్న రేణు.. పిల్లల గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటోంది. ఇటీవల పవన్ గెలిచాక విషెస్ చెప్పిన ఆమె.. అకిరా, ఆద్య రెడీ అయిన పిక్స్ షేర్ చేసి మురిసిపోయింది.

ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలిచాక రేణు పోస్టుల్లో పవర్ స్టార్ ప్రస్తావనను ఎక్కువగా తీసుకొస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇటీవల రేణు తన ఇంట్లో హోమం జరిగినట్లు చెప్పి పోస్ట్ పెట్టింది. దీంతో ఇంకా కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేదని నెటిజన్ అనగా.. ఘాటు రిప్లై ఇచ్చింది రేణు. ఆయనే వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నారని, తాను కాదని చెప్పింది. ఇంకా టార్చర్ పెట్టొద్దని కోరింది.

ఇటీవల మరో వీడియో పోస్ట్ చేసింది రేణు. అదే సమయంలో అనవసరమైన సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం బ్లాక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అయినా దాన్ని పట్టించుకోకుండా మరో నెటిజన్.. ‘మీరు చాలా అన్ లక్కీ మేడమ్.. సో బ్యూటిఫుల్ కొడుకు అండ్ కూతురు ‘ అని పెట్టాడు. దీంతో రేణు గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను ఎలా అన్ లక్కీఓ చెప్పండి ప్లీజ్ అంటూ రిప్లై పెట్టింది. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని వ్యంగ్యంగా చెప్పింది.

అంతటితో ఆగకుండా.. ఆ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టా స్టోరీ పెట్టింది రేణు. తనపై కామెంట్స్ చేస్తున్న వాళ్లకు దిమ్మతిరిగేలా రాసుకొచ్చింది. ‘నన్ను చాలా మంది అన్ లక్కీ అని అంటున్నారు. నా భర్త నన్ను వదిలేసి వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అన్ లక్కీ అంటుంటే చాలా బాధ అనిపిస్తోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మ్యారేజ్ వర్కౌట్ అవ్వకపోతే అన్ లక్కీ అని అనడం మానేస్తారని ఆశిస్తున్నానని చెప్పింది.

మళ్లీ అదే పిక్ ను పోస్ట్ రూపంలో కూడా పెట్టింది రేణు దేశాయ్. ‘ ఇది 2024.. పార్టనర్ చనిపోయినా.. డివోర్స్ తీసుకున్నా.. అదృష్టం లేదని భావించకూడదు. అప్పుడే మనం సొసైటీలో నిజంగా ముందుకు వెళ్తాం. మన మైండ్ సెట్ ను కూడా మార్చుకోవాలి ‘ అని చెప్పింది. దీంతో రేణు దేశాయ్ స్టోరీ అండ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈసారి రేణు దేశాయ్ చాలా ఫీల్ అయినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.