టైగర్ పని పూర్తి చేసిన రేణు దేశాయ్..

రేణూ దేశాయ్… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఈమె వెండితెరపై కనిపించక చాలా ఏళ్లు గడుస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఆమెను ఇప్పటికీ మరిచిపోలేరు. చివరగా పవన్ కల్యాణ్ తో కలిసి జానీ సినిమాలో నటించిన ఈమె.. మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. పవన్ కల్యాణ్ తో పెళ్లి పిల్లలతో బిజీగా గడిపింది. పవర్ స్టార్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని చాలానే కలలు కంది. కానీ పలు కారణాల వల్ల అది అలాగే ఆగిపోయింది.

అప్పుడప్పుడూ పలు టీవీ షోలు వెబ్ సిరీస్ లలో కనిపిస్తున్న రేణూ దేశాయ్… ఆద్య అనే వెబ్ సిరీస్ ను కూడా ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల మరింత ఆలస్యం అవుతుండటంతో మధ్యలోనే అటకెక్కినట్లు కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతం రేణూ దేశాయ్… రవితేజ టైరగ్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ తాజాగా టైగర్ నాగేశ్వర రావు సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది.

రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హేమలతా లవణం అనే పాత్రలో రేణూ దేశాయ్ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయినట్టుగా రేణూ దేశాయ్ తెలిపింది.

ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు పవర్ ఫుల్ రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్ వంశీ కృష్ణకు థాంక్స్ చెప్పింది. అభిషేక్ అగర్వాల్ వారి వల్లే ఈ యూనిట్ అంతా కూడా తనకు ఫ్యామిలీలా మారిందని రాసుకొచ్చింది. ఎంతో కంఫర్ట్ గా పని చేశానని వివరించింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ జరిగే ప్రతీ క్షణం నేను ఎంజాయ్ చేశానంటూ ఇన్ స్టా వేదికగా వెల్లడించింది.

అయితే రేణూ దేశాయ్ అభిమానులతో పంచుకున్న ఈ పోస్టులో ఎక్కడా హీరో రవితేజ పేరు ప్రస్తావించలేదు. దీంతో అందరూ ఎందుకు రేణూ దేశాయ్ హీరో పేరు ప్రస్తావించలేదని అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనకపోవడం వల్లే ఆమె ఇతను పేరు ప్రస్తావించలేదని భావిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే.. సినిమా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.