డ్రస్ కోడ్ తో అడ్డంగా బుక్కైన తమన్నా

మంచు మనోజ్ పక్కన శ్రీ అనే సినిమాలో నటించి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తరువాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లింది. ఈ మధ్య కాలంలో కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమన్నా కథల ఎంపికలో తేడా పడడంతో ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు అయితే ప్రస్తుతానికి లభించడం లేదు.

సినిమా అవకాశాలు తగ్గిన వారంతా అయితే బాలీవుడ్ వంక చూడడం లేక పెళ్లి పీటలు ఎక్కడమో చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తమన్నా భాటియా కూడా పెళ్లి పీటలు ఎక్కి ఎందుకు సిద్ధమవుతోంది.

గత కొన్నాళ్లుగా ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు కూడా వస్తున్నాయి. వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ జంట ఎప్పటికప్పుడు కార్లలో కలిసి కనిపించడం రెస్టారెంట్లకు పబ్బులకు కలిసి వెళ్తూ ఉండడంతో దాదాపుగా వీరిద్దరూ ప్రేమ జంటగానే అందరూ ఫిక్స్ అయిపోయారు.

వీరిద్దరూ కలిసి కనిపిస్తున్న తాము డేటింగ్ లో ఉన్నామన్న విషయాన్ని మాత్రం నేరుగా చెప్పడంలేదు. వారి సన్నిహితులు వీరి బంధాన్ని ధ్రువీకరిస్తున్నా వీరు ధ్రువీకరించి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతామని క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇక తాజాగా వీకెండ్ రావడంతో శుక్రవారం రాత్రి ఈ ఇద్దరు కలిసి మరోసారి కెమెరా కంటపడ్డారు. ఫ్రైడే నైట్ కావడంతో కాస్త సరదాగా గడిపేందుకు వీరిద్దరూ బయటికి వెళ్తూ ఉండగా కెమెరాలు తమ పని చేసుకోపోగా వారిద్దరూ బ్లాక్ కలర్ అవుట్ ఫీట్స్ లో కెమెరా కంట చిక్కారు.

ఇద్దరూ కూడా మ్యాచింగ్ అనుకున్నారో ఏమో తెలియదు. కానీ కావాలనే బ్లాక్ కలర్ అవుట్ ఫిట్లో మెరుస్తున్నారని వారి అభిమానులైతే కామెంట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని మరీ బయటకు వెళ్లడంతో దాదాపుగా వీరి ప్రేమ వ్యవహారం ఖరారు అయినట్లుగానే ప్రచారం జరుగుతోంది. మరి వీలైనంత త్వరగా వీరు అధికారికంగా వెల్లడించి పెళ్లి పీటలు ఎక్కుతారా లేక మరింత ఆలస్యం చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి మరి.