ఆర్థిక ఇబ్బందులతో నటుడు ఆత్మహత్య యత్నం

కరోనా వల్ల కోట్లాది మందికి ఉపాది అవకాశాలు దెబ్బ తిన్నాయి. దాంతో చాలా మంది కనీసం తిండి లేక కూడా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మరి కొందరు ఏదో ఒక పని అన్నట్లుగా దారుణమైన పరిస్థితుల్లో బతుకు నెట్టుకు వస్తున్నారు. టీవీ నటులు పలువురు ఆఫర్లు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఆత్మహత్య యత్నం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల బెంగాలీ నటుడు సువో చక్రబర్తి ఆఫర్లు లేక ఆత్మహత్యకు సిద్దం అయ్యాడు.

తాను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేను ఆర్థికంగా మళ్లీ కోలుకుంటాననే నమ్మకం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఫేస్ బుక్‌ లైవ్‌ ద్వారా చెప్పి నిద్రమాత్రలు మింగాడు. దాంతో వెంటనే పోలీసులకు వీడియో చూసిన వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అతడిని కాపాడారు. ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకగడా ఉందని వైధ్యులు పేర్కొన్నారు. అప్పులు తీర్చలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు.