మేము చాలా బాధపడ్డాం.. మీరు జాగ్రత్త అంటున్న పవన్ హీరోయిన్‌

పవన్‌ కళ్యాణ్ తో తీన్మార్ సినిమాలో నటించిన హీరోయిన్‌ కృతి కర్బంద గుర్తు ఉంది కదా.. ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులు ఇటీవల కరోనా బారిన పడ్డారట. 48 గంటల పాటు వారు నరకం అనుభవించారట. ఈ విషయాన్ని స్వయంగా కృతి కర్బంద సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చింది. కరోనా అనేది మన ఇంటి వరకు వస్తే కాని అర్థం అవ్వడం లేదు అది ఎంత సీరియస్‌. ప్రతి ఒక్కరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ట్విట్టర్ ద్వారా కృతి కర్బందా తన ఫాలోవర్స్ ను మరియు జనాలను హెచ్చరించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ అత్యంత ప్రమాదకరంగా ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల కూడదు అంటూ కృతి కర్బంద విజ్ఞప్తి చేసింది. మా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు అత్యంత దారుణం అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి అత్యంత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కృతి కర్బంద సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కృతి మాత్రమే కాకుండా ఈ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా సీరియస్ నెస్‌ గురించిన ప్రచారం చేస్తూ ఉన్నారు. వారందరికి కూడా అభినందనలు.