ఆ రాక్షసుడ్ని పట్టిస్తే క్యాష్ రివార్డ్ ఇస్తాను: ఆర్పీ పట్నాయక్

చిట్టి తల్లి చైత్ర హత్యాచార ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయింది. మీడియా కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పల్లకొండ రాజు తప్పించుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ కేసులో నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షల ప్రైజ్ మనీని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే.

పి. రాజు ఫోటో, టాటూ వివరాలు, తదితర విషయాలు విడుదల చేసారు. నిందితుడిని పట్టిస్తే తాను 50,000 రూపాయలు ఇస్తానని ప్రముఖ సెలబ్రిటీ ఆర్పీ పట్నాయక్ తెలిపాడు. “చేతిపై మౌనిక పచ్చబొట్టు కచ్చితంగా అతణ్ణి పట్టిస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీసులకు మనం కూడా సహకరిద్దాం” అని తన సోషల్ మీడియా పోస్టులో తెలిపాడు ఆర్పీ పట్నాయక్.