శిల్పాశెట్టి కెరీర్ పై రాజ్ కుంద్రా ఎఫెక్ట్..! ఇదే సాక్ష్యమా..?

పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. శిల్పాశెట్టి కూడా తీవ్ర మనస్తాపానికి గురైందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షోపై ఈ అంశం ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి బలాన్నిస్తూ.. ఈ రియాలిటీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో సాక్ష్యంగా నిలుస్తోంది. ఇందులో శిల్పాశెట్టి స్థానంలో కరిష్మా కపూర్ కనిపించడం ఇందుకు ఊతమిస్తోంది.

అయితే.. కరిష్మా కపూర్ ఈ ఒక్క షోకు మాత్రమే జడ్జిగా వ్యవహరిస్తోందనే వార్తలు కూడా లేకపోలేదు. శిల్పాశెట్టి మళ్లీ జడ్జిగా వస్తుందనే అంటున్నారు. దీంతోపాటు ఆమె నటించిన ‘హంగామా’ సినిమా విడుదలపై కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి తర్వాత నటనకు దూరమైన శిల్పా ఈ సినిమాతో కమ్ బ్యాక్ గ్రాండ్ గా ఇవ్వాలని భావించింది. కానీ.. ఈ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.