రామారావు ‘లక్ష్యం’ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు


మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయ్యాడు. ఖిలాడి మొదలుకుని రామారావు ఆన్ డ్యూటీ.. ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు.. రాక్షసుడు మరియు చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమాలో ముఖ్య పాత్ర.
ఇలా ఆయన సినిమాల జోరు మామూలుగా లేదు. ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యాయి..

రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడ్డా నేపథ్యంలో సినిమాల ఎంపిక విషయంలో కాస్త స్లో అయ్యాడని తెలుస్తోంది. త్వరలో ధమాకా మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను షూటింగ్ ను ముగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే శ్రీవాస్ సినిమా కు రవితేజ ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి కానీ అది నిజం కాదట.

హీరోగా రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో లక్ష్యం చిత్ర దర్శకుడు శ్రీవాస్ కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పిన మాట వాస్తవమే.. అది రవితేజ కు ఇంట్రెస్ట్ గా అనిపించిన మాట వాస్తవే కాని అంతకు మించి సినిమా కు సంబంధించి చర్చలు ఏమీ జరగలేదట. శ్రీవాస్ తో జరిగిన చర్చలు చాలా కామన్ చర్చలు అని.. అలా రోజుకు ఎంతో మంది రవితేజకు స్టోరీ లైన్స్ చెప్తారు అనేది ఆయన సన్నిహితుల మాట.

ప్రస్తుతానికి రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గత సినిమా ల ప్లాప్ నేపథ్యంలో కథల ఎంపిక విషయంలో కాస్త కొత్త దనంను పాటించే ఉద్దేశ్యంతో రవితేజ ఆలోచన చేస్తున్నాడట. అందుకే శ్రీవాస్ కు మాత్రమే కాకుండా ఏ కొత్త సినిమాకు రవితేజ ఇప్పుడు వెంటనే ఓకే చెప్పే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం.

రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో కనీసం రెండు సినిమాలైనా విడుదల అయిన తర్వాత మాత్రమే కొత్త కథలకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. రవితేజకు మరో క్రాక్ వంటి హిట్ కావాల్సి ఉంది. అది ఎప్పటికి వస్తుందో అప్పుడు ఆయన మళ్లీ వరుసగా సినిమాలకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏమీ లేవు.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలే ముగించే పనిలో ఉన్నాడు.