40 పెళ్లిలు చేసుకుంటా మీకు ఎందుకు?

తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ నాల్గవ పెళ్లి చేసుకుంది అంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు శ్రీనివాసన్ తో ఆమె పెళ్లి దుస్తుల్లో ఉండి, దండలు వేసుకుంటున్న ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో ఆయన్ను వనిత పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వచ్చి స్పందించింది. తన పెళ్లి గురించి ఎందుకు ఇంత రాద్దాంతం అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొంది. తాము ఇద్దరం ఒక సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా పేర్కొంది. ఆ సినిమా సందర్బంగా తీసిన ఫొటోలను కొందరు రచ్చ చేస్తున్నారు. అయినా నా పెళ్లి గురించి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నాను. మగవారు ఎన్ని పెళ్లిలు చేసుకున్నా వివాదం లేదు. కాని ఆడవారు పెళ్లి అంటే ఎందుకు చులకనగా చూస్తున్నారు. నా పెళ్లి నా ఇష్టం.. నాలుగు కాదు 40 పెళ్లిలు అయినా చేసుకుంటాను అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.