మహేష్ త్రివిక్రమ్ మూవీ.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతి బాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.. గత ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.

తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఓ పాత్ర కోసం అలనాటి హీరోయిన్ శోభనతో తొలుత చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. గత ఏడాది ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్న శోభన.. ఈ సినిమాలో చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట. దాంతో ఆమె ఆమె స్థానంలో రమ్యకృష్ణ తీసుకోవాలని ఆలోచిస్తుంది మూవీ టీం.

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వరుసగా చాలా సినిమాల్లో నటిస్తూ కెరీర్లో బిజీగా ముందుకెళ్తోంది. అయితే ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు. ఈ క్రమంలోనే ఆమె త్రివిక్రమ్ సినిమా కూడా ఓకే చెప్తుందని సినీవర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయట. మరి రమ్యకృష్ణ శోభనలో ఎవరు నటిస్తారా చూడాలి?

కాగా గతేడాది చివర్లో SSMB28 షూటింగ్ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడం ఆ తర్వాత కొన్ని రోజులకి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో సినిమా షూటింగ్ సరిగ్గా కొనసాగలేదు. దీంతో అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తికాలేదు. ఈ మూవీలో ఇంకా కొన్ని షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.