సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం దృష్టి అంతా కూడా సినిమా టికెట్ల అంశంపైనే మీడియా పెట్టడం ఏంటీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపై అయినా టికెట్ల ఇష్యూను వదిలేసి ఏదైనా పనికి వచ్చే విషయమై మీడియాలో కథనాలు ఇవ్వండి అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. ఏపీ లో ఇన్ని సమస్యలు ఉండగా మరి ప్రభుత్వం ఎందుకు ఆగమేఘాల మీద సినిమా ఇండస్ట్రీ పై పడింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వైకాపా లోపాలు లొసుగులు బయట పడకుండా ఇప్పుడు సినిమా టికెట్ల విషయంను వారే తీసుకు వచ్చి ఇప్పుడు మీడియాను ఆడిపోసుకోవడం ఏంటో అంటూ కొందరు మీడియా వారు చెవులు కొరుక్కుంటున్నారు. మీడియా కు ఏం కవర్ చేయాలో ఎలా చేయాలో అనే విషయంపై స్పష్టత ఉంది.. కనుక మీరు మీ విధులను సరిగ్గా నిర్వర్తించండి మంత్రిగారు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే మీడియా ఈ విషయంపై కాస్త శ్రద్ద తగ్గిస్తే బాగుంటుందనేది సామాన్యుల అభిప్రాయం కూడా..!