అఖండ నమ్మకంను పెట్టుకుంది

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. వరుణ్ తేజ్ కు జోడీగా నటించిన ప్రగ్యా ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ గా మారుతుందని అంతా భావించారు. కాని కంచె సినిమా తర్వాత ఆమెకు చిన్నా చితకా సినిమాలు మాత్రమే వచ్చాయి. అందం మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు ఇలా ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడటం లేదా ఎందుకు ఈమెకు చిన్న సినిమాల ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి అంటూ ఆమె అభిమానులు పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పెద్ద ప్రాజెక్ట్ అయిన బాలకృష్ణ అఖండ సినిమాలో నటించే అవకాశం దక్కింది. బోయపాటి ఈ సినిమాలో ప్రగ్యా కు చాలా కీలకమైన పాత్రను ఇచ్చాడట. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ప్రగ్యా జైస్వాల్ అఖండ ప్రీ రిలీజ్ వేదికపై మురిసి పోయింది.

ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నాను. కథకు నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సినిమాలో నా కాంబో సన్నివేశాల కారణంగానే హీరో ఎంట్రీ ఉంటుంది. చాలా విభిన్నమైన పాత్ర నాది అవ్వడం వల్ల నటనకు స్కోప్ దక్కింది. మొదటి సారి ఇలాంటి పాత్రలో నటించాను. నటించేందుకు మంచి స్కోప్ దక్కడం వల్ల ఈ సినిమా తో తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కిందని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఆఫర్ రావడం చాలా ఆనందం కలిగించిందని.. తప్పకుండా ఈ సినిమా తో ప్రేక్షకులను మెప్పిస్తాను అనే నమ్మకంను వ్యక్తం చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తనకు వరుసగా ఆఫర్లు వస్తాయనే నమ్మకంను అఖండం గా ప్రగ్యా జైస్వాల్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.

బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలు రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత బాగానే ఉంది. కనుక ఈ సినిమా లో కూడా ప్రగ్యా జైస్వాల్ కు మంచి ప్రాముఖ్యత లభించి నటిగా ఆమె మంచి పేరు దక్కించుకుంటే వరుసగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. తెలుగు లో ఈ అమ్మడు అఖండ తర్వాత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ హీరోలు.. కొత్త హీరోలు కాకుండా సీనియర్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు.