షర్మిలకు షాక్ ఇచ్చిన నేతలు

అతి త్వరలోనే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ జెండా ఎగురబోతుంది. ఆ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా వార్తల్లో నిలుస్తుందని మాత్రం అంతా అనుకుంటున్నారు. పార్టీ ని అధికారికంగా ప్రకటించకుండానే పార్టీని సంస్థాగతంగా నిర్మించేందుకు గాను షర్మిల నడుం భిగించారు. ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. త్వరలోనే పార్టీని ప్రకటించబోతున్న సమయంలో అనూహ్యంగా ఆమె పార్టీ నాయకులు కొందరు విభేదాల కారణంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

మహబూబ్ నగర్‌ జిల్లాలో వైఎస్సార్ అభిమానులకు కాకుండా బయటి వారికి పట్టం కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్టీ కార్యక్రమాల్లో మరియు ఇతర నియామకాల్లో తమకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అంటూ కొందరు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. వారు షర్మిల పార్టీకి దూరం అవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. దేవరకద్రకు చెందిన అడ్‌హక్‌ కమిటీ కి కొందరు రాజీనామా చేస్తున్నారు. రేపు హుజూర్‌ నగర్‌ లో షర్మిల పర్యటన ఉంటుంది. ఇలాంటి సమంయలో షర్మిల పార్టీకి కొందరు రాజీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.