సాయి పల్లవితో అంటే.. ఇట్లుంటది మరి!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమా వస్తుంటే చాలు.. బొమ్మ అదిరిపోద్ది అని అంతా ఫిక్స్ అయిపోతారు. ఆమె సెలక్షన్ అలా ఉంటుంది మరి. యాక్టింగ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోతారు. తన నటనతో ఆ రోల్ కే వన్నెతెస్తారు. అలాంటి సాయి పల్లవి.. ఇప్పుడు అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజజీవితం ఆధారంగా రాజ్‌ కుమార్ పెరియసామి తెరకెక్కించిన అమరన్ ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించారు. ముకుంద్ వరదరాజన్ పాత్రలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్ లో సాయి పల్లవి నటించారు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో నేచురల్ బ్యూటీ తన పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపించారు.

అయితే ఇప్పుడు అమరన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు ఏం జరిగిందో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు సాయి పల్లవి. మేల్ ఓరియెంటెడ్ మూవీ అయిన అమరన్ చేసేందుకు తాను ముందు ఒప్పుకోలేదని తెలిపారు. చాలా మంది మేకర్స్.. అలాంటి ప్రాజెక్టుల్లో హీరోయిన్ షూటింగ్ పార్ట్స్ ను కట్ చేస్తున్నారని ఆరోపించారు. బయోపిక్స్ లో కూడా ఇలా జరుగుతుందని అన్నారు. నిడివి ఎక్కువ అయిందని అలా చేశామని చెబుతుంటారన్నారు.

అందుకే అలాంటివి చేయనని రాతపూర్వకంగా ఇవ్వాలని అమరన్ దర్శకుడు రాజ్‌ కుమార్‌ ను తాను కోరానని తెలిపారు సాయి పల్లవి. ఆయన వద్ద స్వేచ్ఛగా మాట్లాడనని చెప్పారు. సినిమాలో హీరో రోల్ కు సమానంగా హీరోయిన్ రోల్ ఉంటుందని ఆయన తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తన వర్క్ ఫ్లో తగ్గిపోయినా పర్లేదు కానీ, తాను ఇప్పటికే ఫిక్స్ అయిన ఓన్ కండీషన్స్ కు విరుద్ధంగా వెళ్లనని క్లారిటీ ఇచ్చారు.

ఎప్పుడైనా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే.. అది నటీనటుల డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందని చెప్పారు. దాని ద్వారా కొత్త మ్యాజిక్స్ క్రియేట్ అవుతాయని తెలిపారు. అలా తమ ప్యాషన్ ను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. నార్మల్ రోల్స్ కొన్ని రోజులకే కనుమరుగు అవుతాయని అన్నారు. కానీ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లు వ్యాఖ్యానించారు సాయి పల్లవి. మరి అమరన్ మూవీతో ఆమె ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.