వైసీపీలోకి భూమా అఖిలప్రియ..! నిజమెంతో..?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారా? అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అఖిలప్రియ సిద్ధంగా ఉన్నారనే అంటున్నారు. ప్రస్తుతం ఆమె చుట్టూ ఈమేరకు ఒత్తిడి వస్తోందని తెలుస్తోంది. నిజానికి అఖిల ప్రియ బంధువులంతా వైఎస్సార్ సీపీలోనే ఉన్నారు. ఆమె సోదరుడి మామ కాటసాని రామిరెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా.. మోహన్ రెడ్డి తదితరులు వైసీపీలోనే ఉన్నారు. వీరంతా అఖిలప్రియపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే..

ఆమె చేరికకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో చేరడమే ఉత్తమనే సలహా ఇస్తున్నారట. ఈనేపథ్యంలో ఆమె కూడా వైఎస్సార్ సీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ అనుమతి ఇస్తే ఆమె వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే అంటున్నారు. దీనిపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.